ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Mar 3rd Modi held Video Conference with Media Groups | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Mar 23 2020 8:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇక, విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. మరోవైపు, కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం,  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో మీడియా ప్రతినిధులు, కెమెరా పర్సన్స్‌, సాంకేతిక నిపుణులు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపోతే, కరోనా దెబ్బకు నేడు స్టాక్‌మార్కెట్లు మరో బ్లాక్‌ మండేను చూడాల్సి వచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement