ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా, పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మంగళవారం వుహాన్‌లో పర్యటించారు. ఇక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇదిలాఉండగా, సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్‌కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది.