
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో మోదీ పాట.. రాష్ట్రంలో ఓవైసీ పాట పాడుతూ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఇక మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాక్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత పౌరులు ఆ దేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని హెచ్చరించింది. బుధవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment