
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ధియా పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ముడిచమురు ధరల భారీ పతనాన్ని గమనించలేదని ఎద్దేవా చేశారు. మరోవైపువిద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది.బుధవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.