
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక సమర్పించింది. ఇక పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.. తనకు ఎంతో సంతృప్తికరమైన పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే శకటాల తుదిజాబితాను కేంద్ర రక్షణశాఖ విడుదలచేసింది. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇందులో చోటుదక్కింది. మరోవైపు హైదరాబాద్‌లో ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారుల ఇళ్లలో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది.శుక్రవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment