
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగాచాంపియన్ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.