ఈనాటి ముఖ్యాంశాలు | Today News Round Up 5th Jan 2020 Vishnukumar Raju Supports Capital in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Sun, Jan 5 2020 7:35 PM | Last Updated on Sun, Jan 5 2020 7:41 PM

Today News Round Up 5th Jan 2020 Vishnukumar Raju Supports Capital in Visakhapatnam - Sakshi

విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. ఇది ఇలా ఉండగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్‌ అధికారి  విజయకుమార్‌పై  చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్‌, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌ తీవ్రంగా ఖండించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక మహారాష్ట్రను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఆదివారం నాడు చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement