ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా, భారత అమెరికా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర, డొనాల్డ్ ట్రంప్ మధ్య చారిత్రక హైదరాబాద్ హౌజ్ వేదికగా మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కిన చిటెట్సు వటనాబె కన్నుమూశారు. ఇకపోతే పౌరసత్వ సవరణ చట్టం పై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.