
పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మరోవైపు రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇకపోతే, పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరసనల కారులపై విమర్శలు గుప్పించారు. మంగళవారం చోటుచేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment