
మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మరోవైపు ఓ మహిళపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి పరారైన ఆర్మీ మాజీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు బాలాజీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఏఆర్ అంతూలేపై పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం మన్ కీ బాత్‌పై వ్యంగ్యోక్తులు విసిరారు. ఆదివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.