
తిరుమల శ్రీవారిని జాను చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్ర యునిట్ సభ్యులు హీరో శర్వానంద్, సమంత, దిల్ రాజు ఆదివారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.ఇదిలా ఉండగా ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మరోవైపు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొన్ని పార్టీలు మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. సీఏఏ తో దేశ పౌరులకు జరుగుతున్న అన్యాయం ఏంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని సంఘటనల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.