
తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కృష్ణలంకలో రిటైనింగ్‌వాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.125 కోట్లు కేటాయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా, గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధరణ పరీక్షలను ఇవాళ్టి నుంచి ప్రారంభించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇకపోతే, వివిధ రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ పరిహారాన్ని రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment