ఎస్సీ సంక్షేమ వసతిగృహాలలో బయోమెట్రిక్ విధానం ప్రారంభం
నల్లగొండ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశపెట్టిన బ యోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు అనేక ఆటుపో ట్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 1 నుంచే జిల్లాలో ప్రయోగాత్మకంగా 98 హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే కంప్యూటర్లు, ఆన్‌లైన్ నెట్‌వర్క్ సదుపాయాలను హాస్టళ్లలో ఏర్పాటు చేశా రు. కానీ విద్యార్థుల హాజరు నమోదుకు వచ్చేసరికి మాత్రం అనేక సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు హాజరు నమోదులోఎలాంటి ఇబ్బందుల్లేవు. కానీ 3,4,5 తరగతుల విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. దీంతో 98 హాస్టళ్లలో 7,411 మంది విద్యార్థులు ప్రవేశం పొందగా 3,598 మంది విద్యార్థుల హాజరు మాత్రమే బయోమెట్రిక్‌లో నమోదవుతోంది. కొన్ని హాస్టళ్లలో కంప్యూటర్లు పనిచేయకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యం నెమ్మదిం చడం వల్ల విద్యార్థుల వేలి ముద్ర లు బయోమెట్రిక్ తీసుకోవడం లేదు. ఒకవేళ హాజరు నమోదైన కొద్దిసేపటి తర్వాత నాట్ కనెక్టింగ్ అని వస్తోంది. దీంతో అనేక హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి.
అసలు సమస్య ఆధారే..
హాస్టళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థుల పూర్తి వివరాలు బయోమెట్రిక్‌లో నమోదు కావాలంటే ఆధార్ కార్డులో పేర్కొన్న వివరాలే ప్రామాణికం. సాంఘిక సంక్షేమ శాఖ లాగిన్‌లో ఆధార్ డేటాను విద్యార్థుల వివరాలకు జత చేస్తారు. ఆ తర్వాత హాస్టల్‌లో బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకునేటప్పుడు విద్యార్థులు వేలి ముద్రలు తీసుకుంటారు. ఆధార్‌కార్డు పొందినప్పుడు ఎంటర్ చేసిన వేలిముద్రలు.. బయోమెట్రిక్ హాజరు వేలిముద్రలు ఒకేవిధంగా ఉండాలి. బయోమెట్రిక్‌లో ఆధార్ నంబరు ఎంటర్ చేసినప్పుడు విద్యార్థుల వివరాలు సరిగానే ఉంటున్నాయి కానీ ఆధార్ వేలి ముద్రలకు, బయోమెట్రిక్ వేలి ముద్రలకు జత కలవడం లేదు. దీంతో అనేక మంది విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. ఈ సమస్య 3,4,5 తరగతుల విద్యార్థుల విషయంలోనే ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఆధార్ కార్డులు తీసుకుని ఏళ్లు గడుస్తుంది కాబట్టి నాటికీ.. నేటికీ విద్యార్థుల వేలి ముద్రల్లో తేడా కనిపిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.
వార్డెన్‌లకు బయోమెట్రిక్...
హాస్టల్ వార్డెన్‌లు, కుక్‌లు, కామాటీలు, వాచ్‌మన్లు, పార్ట్‌టైం వర్కర్స్‌కు బయోమెట్రిక్ హాజరు వర్తింప చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల్లోపు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు హాస్టల్ ఉద్యోగుల హాజరు తీసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం నుంచి అమలు చేసే అవకాశం ఉంది.
బయోమెట్రిక్‌లో ఆటుపోట్లు!
Published Sun, Jul 19 2015 11:21 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement