జీతమో చంద్రన్న!
► సంక్షేమ హాస్టళ్ల్లల్లో జౌట్‌సోర్సింగ్ సిబ్బందికి
► ఏడాదిగా అందని వేతనాలు
► లబోదిబోమంటున్న వైనం
ఉద్యోగం మీద అధారపడి జీవించే కుటుంబాలకు ఒక నెల జీతం ఆలస్యమైతే అల్లాడిపోతారు.. అలాంటి వారు పర్మనెంట్ ఉద్యోగులకు కూడా కాదు.. జౌట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. అలాంటి వాళ్లకి ఏడాదిగా వేతనాలు అందలేంటే వారి పరిస్థితి ఏంటో చెప్పనక్కరలేదు. ఇలాంటి దుస్థితికి టీడీపీ ప్రభుత్వ వైఖరే అద్దం పడుతోంది.
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని 70 పదో తరగతి సాం ఘిక సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వాటిలో పదో తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెప్పేందుకు సబ్జెక్టులను బట్టి మొత్తం 160 మంది ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ట్యూటర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1500 ఇస్తుంటారు. ఇలా 160 మందికి ఏడాదిగా మొత్తం రూ.48 లక్షల వేతనం అందాల్సి ఉంది. ఇచ్చే కొద్దిపాటి జీతం అయినా సరే వాటినే నమ్ముకుని బతుకుబండి లాడే వీరికి కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం పదవతరగతి పరీక్షలు పూర్తయ్యాయి, వసతిగృహాలు సైతం మూసి వేస్తున్నారు. ఏడాది జీతాలు ఇంకా ఇవ్వకుంటే వచ్చే ఏడాది ఇస్తారన్న నమ్మకం ఏముందన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఆరు నెలల నుంచి:
జిల్లాలోని 118 వసతిగృహాల్లో కామాటి, కుక్, వాచ్‌మెన్‌లుగా దాదాపుగా 240 మంది పనిచేస్తున్నారు. వీరికి రూ.6 వేలు నెలకు ఇస్తుంటారు. వీరికి ఇప్పటి వరకు రూ.90 లక్షల వరకు జీతాలు అందాల్సి ఉంది. ప్రస్తు తం ఈనెల 23 నుంచి వసతిగృహాలు మూసివేయనున్నారు. కాని ఇప్పటి వరకు వీటి జీతాలు విషయం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్ని సార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలి తం లేదని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఆరు నెలల క్రితం జిల్లాకు వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తక్షణం జీతాలు విడుదల చేస్తామని చెప్పారే కానీ ఇప్ప టి వరకు విడుదలైన దాఖలాలు లేవు.
ప్రభుత్వానికి నివేదించాం:
ట్యూటర్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాల విషయం మొత్తం ఎంత పెండింగ్‌లో ఉందో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ప్రభుత్వం నుంచి జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయిన వెంటనే వారికి ఇచ్చేస్తాం.
-మధుసూదన్‌రావు,డీడీ సాంఘికసంక్షేమ శాఖ