వసతిగృహాల్లో వైద్య శిబిరం
Published Mon, Jul 25 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
చిట్యాల : మండలంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర వసతి గృహాలు, బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఒడితల పీహెచ్‌సీ డాక్టర్ జడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నెల 23న ‘హాస్టల్‌లో ప్రబలుతున్న జ్వరాలు’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన హాస్టల్ మ్యాట్రిన్ ప్రశాంతి చిట్యాల, జూకల్లులోని బాలికల హాస్టళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిం చారు. 99 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
10 మంది జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్ శ్రీనివాస్, మ్యాట్రి న్ ప్రశాంతి తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ, బిసీ బాలుర హాస్టళ్లు, వెలు గు గురుకుల కళాశాలలో వైద్యశిబిరం నిర్వహించి 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయ శ్రీ, వార్డెన్లు రాంరెడ్డి, కిషన్‌రావు, ఏపీఎంఓ బుచ్చినర్సయ్య, హెచ్‌ఈఓ రాజు, హెల్త్ అసిస్టెంట్లు సాంబయ్య, సుభద్ర, ఆరోగ్యమిత్ర వంగ భిక్షపతి పాల్గొన్నారు.
Advertisement
Advertisement