శ్రీనగర్: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ సీఎం నితీష్‌కుమార్ జేడీయూ పార్టీ కీలకంగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జేడీ(యూ) జనరల్ సెక్రటరీ వివేక్ బాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా జేడీ(యూ) పార్టీ ఉండటంపై పునరాలోచించాలని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
‘‘జమ్ము కశ్మీర్ బీజేపీ నేతలు చేస్తున్నట్లు చర్యలు కారణంగా మా పార్టీ చీఫ్ నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై పునరాలోచించాలని కోరుతున్నాం. మేము ఇస్లామిక్ స్కాలర్లను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వారు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే వారిని మేము వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అయితే మా ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’’ అని వివేక్ బాలి తెలిపారు.
ఇక.. లోక్ సభఎన్నికల్లో బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ) 12 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ.. మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment