2023 ఫిబ్రవరి 10న జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారీ లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నిల్వలను బయటకు తీయడానికి, శుద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
సుమారు 5.9 మిలియన్ టన్నుల వరకు ఉన్న లిథియం నిల్వలను బయటకు తీయడానికి వేర్వేరు లెవెల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్న దేశాల్లో భారతదేశం ఏడవ స్థానం ఆక్రమించింది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీలలో ఎక్కువ శాతం లిథియం వినియోగం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం లిథియం డిపాజిట్ల వేలం ప్రక్రియను 2023 జూన్‌లో ప్రారంభించనున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. లిథియం నిల్వల వేలం ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, వేలం ప్రక్రియలో దీనిని సొంతం చేసుకునే సంస్థలు శుద్ధి చేసే ప్రక్రియను భారతదేశంలోనే జరపాలని, ఏ కారణం చేతనూ విదేశాలకు పంపించకూడదని సంబంధిత వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే)
భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది, అదే సమయంలో దేశంలో బయటపడిన లిథియం నిల్వల వల్ల 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారదేశంలో లిథియం శుద్ధి చేయడానికి కావలసిన సదుపాయాలు లేదు, భవిష్యత్తులో ఇలాంటి సదుపాయాలు దేశంలో నెలకొల్పబడతాయా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రపంచంలో ఎక్కువ లిథియం ఉన్న దేశాల్లో బొలీవియా మొదటి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో వరుసగా అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా దేశాలు ఉన్నాయి, ఇటీవల ఇండియా లిథియం అయాన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం ప్రభుత్వం లిథియం వేలం ప్రక్రియను పూర్తి చేసిన తరువాత జరగాల్సిన పనులు ప్రారంభమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment