కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య నాలుగు రోజులుగా జరుగుతోన్న పోరులో దాదాపు 100 మంది భద్రతా సిబ్బందితోపాటు 20 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి జనరల్ తరీఖ్ షా చెప్పారు. కాబూల్‌లో సోమవారం ఆయన మాట్లాడారు.
ఈ సంఖ్య ఓ అంచనా మాత్రమేననీ, మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదన్నారు. 12 మంది ఉగ్ర నేతలు సహా 194 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయనీ, వారంతా పాకిస్తాన్, చెచన్యా, అరబ్‌కు చెందిన వారేనన్నారు. ఘాజ్నీ ప్రావిన్సు రాజధాని నగరం ఘాజ్నీపై తాలిబాన్లు గత శుక్రవారం నుంచి భీకర దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పట్టణంలోని పలు కీలక ప్రాంతాలను చేజిక్కించుకుని ఉగ్రవాదులు కీలక విజయం సాధించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment