Taliban militants
-
పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి..
ఇస్లామాబాద్: తాలిబన్ మిలిటెంట్లు పాకిస్తాన్లో రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌ను నిర్భంధించారు. అంతేకాదు ఉగ్రవాద వ్యతిరేక శాఖ భద్రతా సిబ్బందిని స్టేషన్లో బంధించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే స్టేషన్లో ఉన్న తమవాళ్లను విడిపించుకునేందుకే తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని బంధించినట్లు తాలిబన్లు ఓ వీడియో విడుదల చేశారు. వాళ్లను విడిచిపెట్టాలంటే తమను క్షేమంగా దేశం దాటించి అఫ్గానిస్తాన్ చేరుకునేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాలిబన్లు స్టేషన్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. తాలిబన్లు బయటి నుంచి దాడి చేశారా? లేక స్టేషన్ లోపలికి వెళ్లి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. వారి చెర నుంచి అధికారులను విడిపించేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తోంది. చదవండి: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు.. -
ప్రపంచ నేతల్లారా నా దేశాన్ని రక్షించండి.. స్టార్ క్రికెటర్ ఆవేదన
లండన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్, నాటో దళాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశం మొత్తం రావణకాష్టంలా రగులుతోంది. గత నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌లలో తాలిబన్లు పౌరులపై జరిపిన దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే 1న అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రదాడులు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లోని దాదాపు 400 జిల్లాలో సగానికి పైగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆగష్టు 31 లోపు అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Dear World Leaders! My country is in chaos,thousand of innocent people, including children & women, get martyred everyday, houses & properties being destructed.Thousand families displaced.. Don’t leave us in chaos. Stop killing Afghans & destroying Afghaniatan🇦🇫. We want peace.🙏 — Rashid Khan (@rashidkhan_19) August 10, 2021 ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలకు ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఓ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ నేతలంతా ఏకమై తన దేశాన్ని రక్షించి, శాంతిని స్థాపించాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించాడు. ‘నా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు అమరులవుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయవద్దు. మాకు శాంతి కావాలి’ అంటూ ట్విటర్లో తన ఆవేదనను పంచుకున్నాడు. -
‘మలాల.. ఈ సారి తప్పించుకోలేవ్’
బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్ జాయ్‌కు మరోసారి బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ సారి తమ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తొమ్మిదేళ్ల క్రితం మలాల మీద కాల్పులు జరిపిన పాకిస్తాన్ తాలిబన్ సంస్థ, మరోసారి ఈ మేరకు బెదిరింపులు జారీ చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన ట్వీట్‌పై బుధవారం నిషేధం విధించారు. కాగా 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్తాన్లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు. పాకిస్తాన్ తాలిబాన్ సభ్యుడు ఎహ్సాన్.. ‘నీతో, మీ నాన్నతో సెటిల్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇందుకు నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రావాలని కోరుతున్నా. ఈసారి ఏ విధంగానూ తప్పించుకోలేవు. చంపేస్తాం’ అని ఓ సందేశం పోస్ట్ చేశాడు. దీనిపై మలాల స్పందిస్తూ.. ‘‘ఇతను నాతోపాటు చాలా మంది అమాయక ప్రజలపై దాడి చేసిన తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ మాజీ ప్రతినిధి. అతను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తున్నాడు. అతను ఎలా తప్పించుకున్నాడు’’ అని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను, అదే విధంగా సైన్యాన్ని ప్రశ్నించింది. కాగా ఎహ్సాన్‌ను 2017లో అరెస్టు చేశారు. అయితే 2020 జనవరిలో అతన్ని పట్టుకున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి తప్పించుకున్నాడు. అంతేగాక అతని అరెస్టు, తప్పిదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఎహ్సాన్ తప్పించుకున్న అనంతరం ఇదే ట్విటర్ అకౌంట్ ద్వారా పాకిస్తాన్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇస్తూ టచ్‌లో ఉన్నాడు. అయితే ఈ అకౌంట్లపై ప్రస్తుతం నిషేధం విధించారు. ఇక మలాలకు వచ్చిన హెచ్చరికలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ప్రధాని సలహాదారు రౌఫ్ హసన్ తెలిపారు. కాగా అనేక సంవత్సరాలు సైనిక కస్టడీలో ఉన్న ఎహ్సాన్ వారి నుంచి ఎలా తప్పించుకున్నాడో, అక్కడి నుంచి టర్కీకి ఎలా వెళ్లాడో కూడా అధికారులు వెల్లడించలేదు. చదవండి: పెళ్ళికూతురు డాన్స్..అంతలోనే విషాదం.. ఏడాది తర్వాత కనిపించిన కిమ్ జోంగ్ ఉన్ భార్య -
తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక
కాబుల్ : అఫ్గానిస్తాన్‌లో ఓ బాలిక తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకున్న ఘటన సంచలనంగా మారింది. తన తల్లిదండ్రులను చంపిన ఇద్దరు తాలిబన్లను ఆమె కాల్చివేశారు. తాలిబన్లపై బుల్లెట్ల వర్షం కురిపించిన ఆ బాలికను గెరివేహ్ గ్రామానికి చెందిన కమర్ గుల్‌గా గుర్తించారు. అయితే ప్రస్తుతం భద్రత దృష్ట్యా ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కమర్ గుల్ తండ్రి గెరివేహ్ గ్రామ పెద్దగా ఉన్నారు. అయితే అతను ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం.. తాలిబన్లకు రుచించలేదు. దీంతో అతని ఇంటిపైకి దాడికి దిగారు. ఇంట్లో ఉన్న అతన్ని బయటకు లాకొచ్చి కాల్చివేశారు. దీనిని అడ్డుకున్న అతని భార్యను కూడా చంపేశారు.(వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం) కళ్లముందే తాలిబన్లు తన తల్లిదండ్రులను చంపేయడంతో రగిలిపోయిన కమర్.. ఇంట్లో నుంచి ఏకే-47 తీసుకొచ్చి వారిపై కాల్పులపై దిగారు. మొదటగా తన తల్లిదండ్రులను చంపిన ఇద్దరు తాలిబన్లను ఆమె మట్టుబెట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న తీవ్రవాదులపైన కూడా తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న మరికొందరు తాలిబన్లు కమర్ ఇంటిపై దాడి చేసేందుకు వచ్చారు. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్) అయితే అప్పటికే కమర్‌ను, ఆమె తమ్ముడిని స్థానికులు, భద్రత బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ప్రస్తుతం తాలిబన్లపై బుల్లెట్ల వర్షం కురిపించిన కమర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది ఆమె ధైర్యాన్ని మెచ్చకుంటూ కామెంట్లు పెడుతున్నారు. -
అప్గనిస్తాన్: ఏడుగురు పౌరుల ఊచకోత!
కాబూల్: భద్రతా బలగాలే లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు బాల్క్ ప్రావిన్స్‌లో మంగళవారం జరిపిన దాడి కారణంగా ఏడుగురు పౌరులు మరణించారని అఫ్గనిస్తాన్ అధికారులు తెలిపారు. షోల్గారా జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య దాడులు జరగ్గా ఏడుగురు పౌరులను తాలిబన్ ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వారిని హతమార్చారని స్థానిక పోలీస్ చీఫ్ సయ్యద్ ఆరిఫ్ ఇక్బాల్ చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించి తాలిబన్ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కాగా, గత ఫిబ్రవరి చివరలో తమతో కుదిరిన శాంతి ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని తాలిబన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. (చదవండి: నకిలీ ‘శాంతి ఒప్పందం’) ఇక దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లో కూడా అదేరోజు సాయంత్రం జరిగిన మోటార్ షెల్ దాడిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తాలిబన్ ఉగ్రవాదులే చేశారని యూఎస్ బలగాలు ఆరోపిస్తుండగా.. అమెరికా భద్రతా బలగాల డ్రోన్ దాడిలోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ ప్రతినిధి ఖరి యూసుఫ్ అహ్మది చెప్తున్నారు. అయితే, తామెలాంటి ఆయుధ ప్రయోగాం చేయలేదని అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ స్పష్టం చేశారు. హింసను తగ్గించేందుకు తాలిబన్‌తో చర్చలు ఉంటాయని ట్వీట్ చేశారు. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా కారణంగా అఫ్గాన్‌లో 14 మంది మరణించగా.. 423 మంది వైరస్ బారిన పడ్డారు. (చదవండి: అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి) -
ఇమ్రాన్ ఖాన్‌కు తాలిబన్ల కౌంటర్!
కాబూల్ : భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలతో తాము మైత్రిని మాత్రమే కోరుకుంటున్నట్లు తాలిబన్ గ్రూప్ అధికార ప్రతినిధి మహ్మద్ సుహైల్ షాహీన్ పేర్కొన్నాడు. సైనిక చర్యలతో ఏమీ సాధించలేమని.. శాంతియుత చర్చల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అభిప్రాయపడ్డాడు. తమ దేశం నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లినంత మాత్రాన భారత్ భయపడాల్సిన అవసరం లేదని... ఎవరికీ హానీ చేసే ఉద్దేశం తమకు లేదని వ్యాఖ్యానించాడు. అఫ్గనిస్తాన్‌లో మోహరించిన తమ సైన్యంపై దాడి చేసి... సైనికులను పొట్టనబెట్టుకుంటున్నారంటూ తాలిబన్లపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్్డ ట్రంప్.. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్తో మాట్లాడిన షాహీన్ తమ విధానాలను స్పష్టం చేశాడు. చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ‘గత 18 ఏళ్లుగా మిలిటరీ ద్వారా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సరైన ఫలితం ఇవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అఫ్గాన్ సమస్యకు అమెరికన్ల వద్ద పరిష్కారం ఉంటే శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలా జరగని పక్షంలో వారు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి తమ సైనికుడిని చంపామని ట్రంప్ అంటున్నారు. కానీ ఇక్కడ రక్తపాతం మొదలుపెట్టింది ఎవరు? అమెరికా సైన్యాలు దాడి చేస్తే మేము అందుకు బదులు ఇస్తున్నాం అంతే. మా ప్రజలపై దాడిని తిప్పికొడుతున్నాం. ఒప్పందం కుదిరిన మరుక్షణమే అమెరికా సైన్యం మాపై మరోసారి కాల్పులకు తెగబడవచ్చు. అదే విధంగా మేము కాబూల్ పాలనలో జోక్యం చేసుకుంటున్నామన్న విషయం సరైంది కాదు. దేశ అంతర్గత, బాహ్య సమస్యలపై మేము దృష్టి సారించాలనుకుంటున్నాం. అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లిన తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా మేము ఎటువంటి చర్యలకు పూనుకోకూడదు. అప్పుడు కచ్చితంగా దేశ అంతర్గత విషయాలపై ప్రజల తరఫున పోరాటం చేస్తాం’ అని షాహీన్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా పాకిస్తాన్ జోక్యంతోనే అఫ్గాన్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... తాము ఇప్పటికే అమెరికాతో చర్చల దశలో ఉన్నామని, ఎవరికి మేలు చేకూర్చే విధంగానో... ఎవరితోనో వైరం పెంచుకునే తరహాలోనూ తాము వ్యవహరించమని స్పష్టం చేశాడు. ఇక అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిన తర్వాత భారత్‌లో తాలిబన్లు అలజడి సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం గురించి మాట్లాడుతూ... తమకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని... దేశ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి తాము అంకితం అవుతామని.. ఇందుకు భారత్ సహాయం కూడా అవసరమని షాహీన్ పేర్కొన్నాడు. -
అఫ్గాన్‌లో సైన్యం–ఉగ్రవాదుల పోరు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య నాలుగు రోజులుగా జరుగుతోన్న పోరులో దాదాపు 100 మంది భద్రతా సిబ్బందితోపాటు 20 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి జనరల్ తరీఖ్ షా చెప్పారు. కాబూల్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సంఖ్య ఓ అంచనా మాత్రమేననీ, మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదన్నారు. 12 మంది ఉగ్ర నేతలు సహా 194 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయనీ, వారంతా పాకిస్తాన్, చెచన్యా, అరబ్‌కు చెందిన వారేనన్నారు. ఘాజ్నీ ప్రావిన్సు రాజధాని నగరం ఘాజ్నీపై తాలిబాన్లు గత శుక్రవారం నుంచి భీకర దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పట్టణంలోని పలు కీలక ప్రాంతాలను చేజిక్కించుకుని ఉగ్రవాదులు కీలక విజయం సాధించినట్లు సమాచారం. -
పాక్ ఆర్మీపై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్వాత్ జిల్లాలోని ఆర్మీ యూనిట్ లక్ష్యంగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ మేజర్ సహా 11 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. తాలిబాన్లకు గట్టి పట్టున్న స్వాత్ లోయలోని ఆర్మీ బేస్ సమీపంలో శనివారం ఈ దాడి జరిగినట్లు పాక్ ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. తొలుత నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాది.. ఆర్మీ బేస్ బయట వాలీబాల్ ఆడుతున్న సైనికులు లక్ష్యంగా తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించింది. -
నా భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు..
ఒట్టావా: తాలిబన్ ఉగ్రవాదులు తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని, తన బిడ్డను హత్య చేశారని జాషువా బోయిలే చెప్పాడు. గత ఐదేళ్లుగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా–అమెరికన్ జాషువా కుటుంబ సభ్యులు బుధవారం సురక్షితంగా విడుదలయ్యారు. జాషువా, అతని భార్య కైట్లన్ కోల్మన్తోపాటు ముగ్గురు పిల్లలు శుక్రవారం టొరంటో చేరుకున్నారు. ఉగ్రవాదులు పెట్టిన చిత్రహింసలను జాషువా మీడియాకు తెలిపారు. ‘2014లో నా భార్యపై హక్కానీ ఉగ్రవాదులు అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కిరాతకంగా నా బిడ్డను హత్య చేశారు’ అని జాషువా చెప్పారు. ఓ గార్డుతోపాటు హక్కానీ కమాండర్ అబూ హజర్ తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. -
జర్మనీ కాన్సులేట్‌పై ఆత్మాహుతి దాడి
కాబుల్: అప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబుల్‌లోని జర్మన్ కాన్సులేట్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలుకోల్పోగా 80మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాడి జరిగిన ప్రాంతం రక్తసిక్తంగా మారింది. 'ఒక ఉగ్రవాది కారు బాంబుతో వచ్చి జర్మనీ రాయబార కార్యాలయం గేటువద్ద గురువారం రాత్రి తొలుత ఓ వ్యక్తిని చంపి అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఈ క్రమంలో చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారంతా స్థానికులే' అని అక్కడి పోలీసులు చెప్పారు. ఈ దాడి జరిగిన వెంటనే తామే చేశామని నేరుగా తాలిబన్ ప్రకటిచుకుంది. ఇటీవల కుందుజ్ ప్రాంతంలో దాడులకు ప్రతీకారంగానే తాము ఆత్మాహుతి దాడికి దిగినట్లు తాలిబన్ సంస్థ అధికారిక ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు. -
ఆఫ్ఘాన్‌లో 16 మంది తీవ్రవాదులు హతం
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్‌లోని కుంద్ ప్రావిన్స్‌లో అమెరిక జరిపిన ద్రోణుల దాడుల్లో 16 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ మిలటరీ ఉన్నతాధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిపిన ఈ దాడిలో తాలిబాన్ సీనియర్ నాయకుడు ముల్హా జన్నత్ గుల్తోపాటు మరో 15 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే రెండు వాహనాలు కూడా ధ్వంసమైనాయని వెల్లడించారు. -
27 మంది ప్రయాణికుల కిడ్నాప్
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు కనీసం 27 మంది ప్రయాణికులును కిడ్నాప్ చేశారు. మంగళవారం దక్షిణాది ప్రావిన్స్ హెల్మాండ్‌లో కాబూల్-హెరాత్ హైవేపై వెళ్తున్న మూడు వాహనాలను సాయుధ తాలిబన్ ఉగ్రవాదులు అడ్డగించారు. రెండు ట్రక్లు, ఓ బస్సులో ప్రయాణిస్తున్నవారిని తాలిబన్లు బందీలుగా చేసుకుని, సమీపంలోని గ్రామాల్లోకి తీసుకెళ్లినట్టు భద్రత దళాల వర్గాలు వెల్లడించాయి. బందీలను విడిపించడం కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు హెల్మాండ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ అఖా నూర్ కెంటోజ్ తెలిపారు. కాగా 27 మంది ప్రయాణికులను విచారణ కోసం తీసుకెళ్లినట్టు తాలిబన్ ప్రతినిధి ఖారి యూసుఫ్ అహ్మది వెల్లడించాడు. -
పాక్ వర్సిటీలో నరమేధం
-
న్యూస్ చానల్ బస్సుపై ఆత్మాహుతిదాడి
ఏడుగురు మృతి; 24 మందికి గాయాలు కాబూల్: అఫ్గానిస్తాన్ తొలిసారి ఒక మీడియా సంస్థ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రాజధాని కాబూల్‌లో, రష్యా రాయబార కార్యాలయం దగ్గర ప్రముఖ న్యూస్ చానల్ ‘టోలో’ ఉద్యోగులను ఇంటికి తీసుకువెళ్తున్న మిని బస్సుపై బుధవారం ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. దాడిలో సంస్థకు చెందిన ఏడుగురు ఉద్యోగులు చనిపోయారు. 24 మంది గాయాల పాలయ్యారు. భారీ పేలుడుతో బస్సుకు మంటలంటుకోవడంతో పలువురు ఉద్యోగులు లోపలే సజీవదహనమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారిలో న్యూస్ చానల్‌కు చెందిన గ్రాఫిక్స్, డబ్బింగ్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉన్నారు. కుందుజ్ పట్టణంలో తాలిబాన్ ఉగ్రవాదులు ఒక యువతిపై అత్యాచారం చేశారన్న వార్తను ప్రసారం చేయడంతో కొన్ని నెలల క్రితమే.. టోలో, 1టీవీ చానళ్లపై దాడులు చేస్తామని ఉగ్రవాదులు చెప్పారు.. ఆ వార్తను సైతాను వ్యవస్థల అబద్ధపు ప్రచారంగా పేర్కొన్నారు. తాలిబాన్‌తో చర్చలను పునః ప్రారంభించే నిమిత్తం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, అమెరికా దేశాల ప్రతినిధుల భేటీ రెండు రోజుల క్రితమే కాబూల్‌లో జరగడం గమనార్హం. తాలిబాన్ ప్రతినిధులెవ్వరూ ఆ భేటీలో పాల్గొనలేదు. -
పాక్ వర్సిటీలో నరమేధం
విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించిన తాలిబాన్ ఉగ్రవాదులు 20 మంది మృతి ఆర్మీ చేతిలో మొత్తం ♦ నలుగురు ఉగ్రవాదుల హతం ♦ దాడిని ఖండించిన ప్రణబ్, మోదీ పెషావర్: పాకిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో బుధవారం తాలిబాన్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. వర్సిటీలోకి చొరబడి.. విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దాడిలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ సహా కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందివరకు తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్‌కు సుమారు 50 కి.మీ.ల దూరంలో, వాయువ్య పాక్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని చార్సద్దాలో ఉన్న ప్రఖ్యాత బాచాఖాన్ విశ్వవిద్యాలయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జాతీయ నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అలియాస్ బాచాఖాన్ పేరుమీద ఏర్పాటు చేసిన ఆ వర్సిటీలో దాదాపు 3 వేల మంది విద్యార్థులతో పాటు బచాఖాన్ వర్ధంతి సందర్భంగా అక్కడ జరుగుతున్న కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన 600 మంది అతిథులు కూడా ఉన్నారు. గ్రెనేడ్లు, ఆధునిక ఆయుధాలతో వర్సిటీ గోడ దూకి లోపలకి వచ్చిన నలుగురు ఉగ్రవాదులు తరగతి గదుల్లో, హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందగానే హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకున్న సైనిక దళాలు, ప్రత్యేక శిక్షణ పొందిన కమెండో దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ప్రారంభించాయి. రెండు వేర్వేరు భవనాల్లో దాగి కాల్పులు జరుపుతున్న నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. వర్సిటీలోని భవనాలను జల్లెడ పట్టి, టైస్టులెవరూ మిగిలి లేరని నిర్ధారించుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆపరేషన్ ముగిసిందని, నలుగురు టైస్టులను తమ దళాలు హతమార్చాయని ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ స్వయంగా యూనివర్సిటీకి వెళ్లి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. ఉగ్రదాడి సమాచారం తెలియగానే భయాందోళనలతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వర్సిటీకి చేరుకున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ‘తెహరీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్’ తెలిపింది. ఏడాది క్రితం పెషావర్ సైనిక స్కూళ్లో దాడి అనంతరం భద్రతాదళాల చేతిలో తమవారెందరో హతమయ్యారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడ్డామని ఆ సంస్థ ప్రతినిధి మన్సూర్ చెప్పారు. పెషావర్‌లోని ఓ సైనిక స్కూళ్లో 2014, డిసెంబర్లో తాలిబాన్ ఇదే తరహాలో నరమేధం సృష్టించి 150 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దానికే మన్సూరే సూత్రధారి. అంతు చూస్తాం: షరీఫ్ పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్, విపక్షనేత ఇమ్రాన్ ఖాన్ తదితరులు దాడిని త్రీవంగా ఖండించారు. అమాయక విద్యార్థులను అన్యాయంగా చంపేసిన హంతకులకు మతం లేదని, పాక్‌లో ఉగ్రవాదం అంతానికి కట్టుబడి ఉన్నామని నవాజ్ అన్నారు. జాలి లేకుండా విరుచుకుపడ్తామని ఉగ్ర సంస్థలను హెచ్చరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు జ్యూరిక్ వెళ్లిన షరీఫ్.. అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. యూకేలో ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా సీఎం పర్వేజ్ ఖటాక్.. స్వదేశానికి పయనమయ్యారు. దాడిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విద్యార్థులకు తన ప్రాణం అడ్డేసిన అధ్యాపకుడు పెషావర్ ఘటనలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరమరణం విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ హమీద్ హుస్సేన్ (34), వారి కోసం ప్రాణాలను బలిచ్చాడు. విద్యార్థులను గదిలోనే ఉండమని చెప్పి.. తుపాకీ తీసుకుని.. ఉగ్రవాదులపై ఎదురుదాడి చేశాడు. బుల్లెట్లు దిగుతున్నా ఎదురుదాడి చేసి, అమరుడయ్యాడు. బాచాఖాన్ వర్సిటీపై మిలిటెంట్లు దాడి చేసినపుడు.. హుస్సేన్ పాఠం చెబుతున్నారు. కాల్పుల శబ్దం విన్న హుస్సేన్ విద్యార్థులెవరూ క్లాస్ వదిలి బయటకు రావొద్దని హెచ్చరించారు. తన తుపాకీని ఉగ్రవాదులపై గురిపెడుతూ బయటకెళ్లాడు. అంతలోనే ఓ బుల్లెట్ ఆయన శరీరంలోకి దూసుకెళ్లినా.. వెనక్కు తగ్గకుండా, వారిపై కాల్పులు జరిపాడు. వారి దృష్టిని మరల్చి క్లాస్‌లోని విద్యార్థులను కాపాడాడు. ‘ఆయన బయటికి వెళ్లగానే వర్సిటీ వెనకవైపున్న గోడదూకి పారిపోయాం’ అని ఓ విద్యార్థి తెలిపాడు. ‘ఉగ్రవాదులు గట్టిగా అరుస్తూ.. వర్సిటిలోకి దూసుకొచ్చారు. ప్రొఫెసర్‌ను చూసి ఆయనపై కాల్పులు జరిపారు. రిజిస్ట్రార్ గదిలోకి వారు వెళ్లగానే, మేం పారియాం’ అని మరో విద్యార్థి తెలిపాడు. 2014లో పెషావర్ స్కూలుపై దాడి తర్వాత ఉపాధ్యాయులు గన్ వెంట ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
54 మంది ఉగ్రవాదులు హతం
కాబూల్: తాలిబన్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘానిస్తాన్ సైన్యం చేతిలో 54 తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఘాంజీ, కాందహార్, లగ్మాన్, ఫర్యాబ్, సారిపౌల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు తాము 24గంటలపాటు సైనిక దాడులు నిర్వహించామని ఇందులో 54 మంది హతమయ్యారని, 18 మందిని బంధీలుగా పట్టుకున్నామని అందులో పేర్కొన్నారు. -
తిరుపతి ఎమ్మెల్యేకు అసెంబ్లీ నివాళి
వెంకటరమణ అజాతశత్రువని ప్రశంసించిన సభ బడుగు, బలహీనవర్గాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు: బాబు ఆయన మరణం పేదలకు తీరని లోటు: జగన్ సంతాప తీర్మానానికి సభ ఆమోదం, అసెంబ్లీ రేపటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు వెంకటరమణకు ఏపీ శాసనసభ గురువారం నివాళులర్పించింది. వెంకట రమణ అజాతశత్రువని కొనియాడింది. ఈ మేరకు సంతాపతీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వెంటనే సీఎం చంద్రబాబు స్పీకర్ అనుమతితో సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. వెంకటరమణ కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ బలహీనవర్గాల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారని సీఎం చెప్పారు. సహనానికి మారు పేరుగా నిలిచారని కొనియాడారు. ఆయన మృతి పేదలకు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబానికి, పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు. వెంకటరమణ భార్య సేవకు మారుపేరని, దేవతామూర్తి అని చెప్పారు. రమణకు మృతికి సభ్యుల సంతాపం మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, బి.గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్లపల్లి సూర్యారావు, విష్ణుకుమార్ రాజు, సత్యప్రభ, దేశాయ్ తిప్పారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కాలువ శ్రీని వాసులు, నారాయణస్వామి, జగ్గిరెడ్డి తదితరులు వెంకటరమణ మృతికి సంతాపం తెలి పారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన సేవాతత్పరతను,అంకితభావాన్ని గుర్తుచేసుకున్నారు. వెంకటరమణ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొనియాడారు. అనంతరం సభ సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. సభ్యులందరూ లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. పెషావర్ ఉచకోతపై ఖండన పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఓ సైనిక స్కూలులో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన విద్యార్థుల ఊచకోతను శాసనసభ ఖండించింది. ఈ అమానవీ య, అమానుష సంఘటనను నాగరిక ప్రపం చం సహించకూడదని పేర్కొంది. తాలిబన్ల కిరాతకానికి ఇప్పటికి 148 మంది అభం శుభం తెలియని విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న వీరిని ఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదులు కాల్చివేసి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు సభ ఓ తీర్మానాన్ని ఆమోదిం చింది. విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటిం చింది. సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రతి పాదించారు. ఉన్మాదానికి హద్దులు లేకుండా పోయాయని అన్నారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఇటువంటి హేయమైన చర్యను యావత్ ప్రపంచం ఖండించాలన్నారు. మరణిం చిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలి పారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణుకుమార్‌రాజు, జాన్‌బాషా తదితరులు కూడా మాట్లాడారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. సింగపూర్ తీసుకెళ్లి ఉంటే బాగుండేది: జగన్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నా రు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి అనేక ఉన్నత పదవులు నిర్వహించిన నేత అని కొనియాడారు. అసెంబ్లీ గత సమావేశాలప్పు డే ఆయన ఆరోగ్యం బాగాలేదని గమనించామని, తూలిన పరిస్థితి కూడా చూశామని తెలిపారు. ఆ సందర్భంలోనే సింగపూర్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని అనుకున్నారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారని వివరించారు. కానీ ముఖ్యమంత్రి కొందరు కార్పొరేట్ పెద్దలతో కలసి ప్రైవేటు విమానంలో సింగపూర్ వెళ్లారని, అదే విమానంలో రమణను తీసుకుని వెళ్లి వైద్యం చేయించి ఉంటే ఈవేళ ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. విధిని ఎవ్వరూ ఆపలేకపోయారని, ఆ కుటుంబానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రమణకు ఇద్దరు పిల్లలని, వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారని, వారిని పెంచి పెద్ద చేసేందుకు ఆ తల్లి (రమణ సతీమణి) ఎంత అవస్థ పడిందో మాటల్లో వర్ణించలేమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
తీవ్రవాదులు కాల్పులు: 11 మంది పౌరులు హతం
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఫరాహ్ ప్రావెన్స్లో 11 మంది పౌరులపై తాలిబన్ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో పౌరులంతా మరణించారని ఫరాహ్ ప్రావెన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతి చెందిన పౌరులంతా ఇరాన్లో కార్మికులుగా పని చేసేందుకు వలస వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. వీరంతా పశ్చిమ ఫరాహ్ ప్రావెన్స్ వాసులని చెప్పారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. -
భద్రత దళాలు కాల్పులు: 10 మంది తీవ్రవాదులు మృతి
ఆఫ్ఘానిస్థాన్ గజని ప్రావెన్స్లోని జిలాన్ జిల్లాలో శనివారం భద్రత దళాలు, తీవ్రవాదుల మధ్య హోరా హోరి కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 10 మంది తీవ్రవాదులు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రవాదులు గాయపడ్డారు. ఈ మేరకు జిలాన్ జిల్లా గవర్నర్ మహబూబ్ల్లా సబ్వాన్ వెల్లడించారు. కాబూల్‌కు దక్షిణ భాగంలో 125 కిలోమీటర్ల దూరంలో ఆ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. భద్రత దళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా భద్రత దళాలకు తీవ్రవాదులు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో భద్రత దళాలుపై తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై తీవ్రవాదులపై కాల్పులు జరిపారని తెలిపారు. -
అఫ్ఘానిస్థాన్‌లో 40 మంది తాలిబన్ల కాల్చివేత
అప్ఘానిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘాన్ జాతీయ పోలీసులు మొత్తం 40 మంది తాలిబన్లను కాల్చివేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో నిర్వహించిన ఆపరేషన్లలో పోలీసులు పైచేయి సాధించారు. బాగ్లాన్, వార్డక్, లోగర్, కాంధహార్, గజ్నీ, నాంగరహార్, సారిపుల్ రాష్ట్రాల్లోని తాలిబన్ స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులో పోలీసులు గాయపడినట్టు ఎలాంటి వార్తలు రాలేదు. ఈ సంఘటనకు సంబంధించి తాలిబన్లు స్పందించలేదు. -
అఫ్ఘాన్‌లో 36 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం
అఫ్ఘానిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్మీ దళాల జరిపిన కాల్పుల్లో 36 మంది తాలిబాన్ తీవ్రవాదులు మరణించారని ఆ దేశ హోంశాఖ మంత్రి బుధవారం ఇక్కడ వెల్లడించారు. మరో పది మంది గాయపడ్డారని తెలిపారు. తీవ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా ఒక్క రోజుల్లో దళాలు జరిపిన కాల్పుల్లో వారు నేలకొరిగారని చెప్పారు. ఆర్మీ దళాలతో కలసి అఫ్ఘానిస్థాన్ నేషనల్ పోలీసులు సంయూక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయని పేర్కొన్నారు. మరో 10 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆరు మందుపాతరలను నిర్వీర్యం చేసినట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి వివరించారు.