అప్ఘానిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘాన్ జాతీయ పోలీసులు మొత్తం 40 మంది తాలిబన్లను కాల్చివేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో నిర్వహించిన ఆపరేషన్లలో పోలీసులు పైచేయి సాధించారు. బాగ్లాన్, వార్డక్, లోగర్, కాంధహార్, గజ్నీ, నాంగరహార్, సారిపుల్ రాష్ట్రాల్లోని తాలిబన్ స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులో పోలీసులు గాయపడినట్టు ఎలాంటి వార్తలు రాలేదు. ఈ సంఘటనకు సంబంధించి తాలిబన్లు స్పందించలేదు.
అఫ్ఘానిస్థాన్లో 40 మంది తాలిబన్ల కాల్చివేత
Published Mon, Oct 14 2013 2:16 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement