అఫ్ఘాన్లో 36 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం | 36 Taliban militants killed in Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్ఘాన్లో 36 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం

Published Wed, Aug 28 2013 3:24 PM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

36 Taliban militants killed in Afghanistan

అఫ్ఘానిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్మీ దళాల జరిపిన కాల్పుల్లో 36 మంది తాలిబాన్ తీవ్రవాదులు మరణించారని ఆ దేశ హోంశాఖ మంత్రి బుధవారం ఇక్కడ వెల్లడించారు. మరో పది మంది గాయపడ్డారని తెలిపారు. తీవ్రవాదుల ఏరివేత చర్యల్లో భాగంగా ఒక్క రోజుల్లో దళాలు జరిపిన కాల్పుల్లో వారు నేలకొరిగారని చెప్పారు.

ఆర్మీ దళాలతో కలసి అఫ్ఘానిస్థాన్ నేషనల్ పోలీసులు సంయూక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయని పేర్కొన్నారు. మరో 10 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆరు మందుపాతరలను నిర్వీర్యం చేసినట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement