
27 మంది ప్రయాణికుల కిడ్నాప్
కాబూల్: అఫ్ఘానిస్తాన్లో తాలిబన్లు కనీసం 27 మంది ప్రయాణికులును కిడ్నాప్ చేశారు. మంగళవారం దక్షిణాది ప్రావిన్స్ హెల్మాండ్లో కాబూల్-హెరాత్ హైవేపై వెళ్తున్న మూడు వాహనాలను సాయుధ తాలిబన్ ఉగ్రవాదులు అడ్డగించారు. రెండు ట్రక్లు, ఓ బస్సులో ప్రయాణిస్తున్నవారిని తాలిబన్లు బందీలుగా చేసుకుని, సమీపంలోని గ్రామాల్లోకి తీసుకెళ్లినట్టు భద్రత దళాల వర్గాలు వెల్లడించాయి.
బందీలను విడిపించడం కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు హెల్మాండ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ అఖా నూర్ కెంటోజ్ తెలిపారు. కాగా 27 మంది ప్రయాణికులను విచారణ కోసం తీసుకెళ్లినట్టు తాలిబన్ ప్రతినిధి ఖారి యూసుఫ్ అహ్మది వెల్లడించాడు.