కాబూల్: తాలిబన్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఫ్ఘానిస్తాన్ సైన్యం చేతిలో 54 తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఘాంజీ, కాందహార్, లగ్మాన్, ఫర్యాబ్, సారిపౌల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు తాము 24గంటలపాటు సైనిక దాడులు నిర్వహించామని ఇందులో 54 మంది హతమయ్యారని, 18 మందిని బంధీలుగా పట్టుకున్నామని అందులో పేర్కొన్నారు.