జర్మనీ కాన్సులేట్పై ఆత్మాహుతి దాడి
కాబుల్: అప్ఘనిస్థాన్లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబుల్లోని జర్మన్ కాన్సులేట్పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలుకోల్పోగా 80మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాడి జరిగిన ప్రాంతం రక్తసిక్తంగా మారింది.
'ఒక ఉగ్రవాది కారు బాంబుతో వచ్చి జర్మనీ రాయబార కార్యాలయం గేటువద్ద గురువారం రాత్రి తొలుత ఓ వ్యక్తిని చంపి అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఈ క్రమంలో చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారంతా స్థానికులే' అని అక్కడి పోలీసులు చెప్పారు. ఈ దాడి జరిగిన వెంటనే తామే చేశామని నేరుగా తాలిబన్ ప్రకటిచుకుంది. ఇటీవల కుందుజ్ ప్రాంతంలో దాడులకు ప్రతీకారంగానే తాము ఆత్మాహుతి దాడికి దిగినట్లు తాలిబన్ సంస్థ అధికారిక ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు.