ఒట్టావా: తాలిబన్ ఉగ్రవాదులు తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని, తన బిడ్డను హత్య చేశారని జాషువా బోయిలే చెప్పాడు. గత ఐదేళ్లుగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా–అమెరికన్ జాషువా కుటుంబ సభ్యులు బుధవారం సురక్షితంగా విడుదలయ్యారు.
జాషువా, అతని భార్య కైట్లన్ కోల్‌మన్‌తోపాటు ముగ్గురు పిల్లలు శుక్రవారం టొరంటో చేరుకున్నారు. ఉగ్రవాదులు పెట్టిన చిత్రహింసలను జాషువా మీడియాకు తెలిపారు. ‘2014లో నా భార్యపై హక్కానీ ఉగ్రవాదులు అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కిరాతకంగా నా బిడ్డను హత్య చేశారు’ అని జాషువా చెప్పారు. ఓ గార్డుతోపాటు హక్కానీ కమాండర్ అబూ హజర్ తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment