killed boy
-
సెలవు కోసం.. తోటి బాలుడిని చంపేశారు!
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఐదేళ్ల బాలుడిని తోటి బాలురే పొట్టనబెట్టుకున్నారు. మదర్సాకు సెలవిస్తే ఇంటికి వెళ్లొచ్చనే దురాచనతో, టీవీలో క్రైం షోలో చూపినట్లే చేశామని నిందితులు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు.శుక్రవారం దయాళ్పూర్ ఏరియాలోని తలీముల్ ఖురాన్ మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9, 11 ఏళ్ల ముగ్గురు బాలురను విచారించగా దారుణం వెలుగు చూసింది. మదర్సాకు సెలవిస్తారని తోటి బాలుడ్ని కొట్టి చంపినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. -
కేరళలో నిఫా వైరస్ కలకలం.. బాలుడు మృతి
కేరళ: కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు ఆదివారం మరణించాడు. ఆదివారం ఉదయం బాలుడికి గుండెపోటు వచి్చందని, అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, 11.30 గంటలకు మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాలుడు చికిత్స పొందుతున్న కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. అయితే 246 మంది బాలుడితో కాంటాక్ట్ అయ్యారని, వారిలో 63 మంది హై–రిస్క్ కేటగిరీ కింద ఉన్నారని తెలిపింది. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
ప్రాణం తీసిన భూవివాదం: బడి ఎదుటే హత్య
బటాలా (పంజాబ్): దాయాదుల మధ్య ఏర్పడిన వివాదం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రెండు ఇళ్ల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో ఏర్పడిన గొడవ ఆ విద్యార్థి ప్రాణం మీదకు వచ్చింది. దాయాదులు ఆయుధాలతో వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పంజాబ్లోని బటాలాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుమాన్ గ్రామానికి చెందిన 12వ తరగతి చదువుతున్న సిమ్రాన్దీప్ సింగ్ (18) తన సోదరుడు హర్మన్దీప్ సింగ్తో కలిసి పాఠశాలకు వెళ్లాడు. తరగతుల అనంతరం పాఠశాల నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరిపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఆయుధాలతో వారిపై దాడికి పాల్పడ్డారు. తల, మెడ, ఛాతీపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన సిమ్రాన్దీప్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ఈ దాడి నుంచి హర్మన్దీప్ సింగ్ ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ వారి చేతికి చిక్కడంతో సిమ్రాన్ దీప్ ప్రాణాలు కోల్పోయాడు. పక్కింటి వారితో నెలకొన్న భూ వివాదమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పక్కింటివారిపై మృతుడి తండ్రి హర్దేవ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302, ఇతర సెక్షన్ల కింద మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి సురేందర్ సింగ్ తెలిపారు. -
నా భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు..
ఒట్టావా: తాలిబన్ ఉగ్రవాదులు తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని, తన బిడ్డను హత్య చేశారని జాషువా బోయిలే చెప్పాడు. గత ఐదేళ్లుగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా–అమెరికన్ జాషువా కుటుంబ సభ్యులు బుధవారం సురక్షితంగా విడుదలయ్యారు. జాషువా, అతని భార్య కైట్లన్ కోల్మన్తోపాటు ముగ్గురు పిల్లలు శుక్రవారం టొరంటో చేరుకున్నారు. ఉగ్రవాదులు పెట్టిన చిత్రహింసలను జాషువా మీడియాకు తెలిపారు. ‘2014లో నా భార్యపై హక్కానీ ఉగ్రవాదులు అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కిరాతకంగా నా బిడ్డను హత్య చేశారు’ అని జాషువా చెప్పారు. ఓ గార్డుతోపాటు హక్కానీ కమాండర్ అబూ హజర్ తన భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. -
మంచితనంగా ఇంటికి పిలిచి దారుణం
అమృత్సర్: తమకు ఉన్న పరిచయం మేరకు మంచితనంగా ఓ గృహిణిని ఇంటికి పిలిపించి ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చిన స్నేహితురాలిపై దాడి చేసి స్పృహలేనిపరిస్థితుల్లో చనిపోయిందనుకొని ఓ కాలువలో పడేశారు. అదృష్టం కొద్ది ఆమె తిరిగి స్పృహలోకి రావడంతో నేరుగా ఇంటికెళ్లి భర్తకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే ఓ మహిళ ఉంది. ఆమెకు బాజ్ సింగ్, ఫతే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా మంజిత్ కౌర్ మహిళ ఆహ్వానించింది. ఆమె ఇంటికి రాగానే మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ అనే ఇద్దరు వారిపై దాడి చేశారు. ఆమెను కొట్టి చనిపోయిందని కాలువలో పడేసి పిల్లలను ఎత్తుకెళ్లారు. అందులో ఫతేకు ఎనిమిది నెలలు కాగా బాజ్కు ఎనిమిదేళ్లు. వీరిని నేరుగా తీసుకెళ్లిన వారు క్షుద్రపూజలకోసం అమ్మేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విషయం తెలిసింది. బాజ్ను రూ.50వేలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. అయితే, బాజ్ తిరగబడినంత పనిచేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భయంతో అతడిని హత్య చేసి ఓ ఊరి వద్ద పడేశారు. నేరాన్ని వారు స్వయంగా అంగీకరించడంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు.