
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. (చదవండి: ఎన్నికల ప్రచారం.. తిరక్కుండానే టైమౌట్)
గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు..
1,704 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,085 అత్యoత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1500 మంది రౌడీషీటర్ల బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా 3,744 వెపన్స్ డిపాజిట్ చేశారు. జోన్ల వారిగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారిగా ఇంచార్జ్ ఏసీపీ, సీఐలను నియమించారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన నేతలపై 55 కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా పలుచోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు.సీసీ టీవీ మానటరింగ్ టీమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. (చదవండి: కేసీఆర్‌ను కొట్టడానికి రాలేదు: అమిత్ షా)
Comments
Please login to add a commentAdd a comment