విధిరాత అంటే ఇదేనేమో.. | Before Cremation of Martyred Soldier, His Wife Delivers Baby Girl | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 23 2018 8:24 PM | Last Updated on Tue, Oct 23 2018 8:27 PM

Before Cremation of Martyred Soldier, His Wife Delivers Baby Girl - Sakshi

పిల్లల కోసం 10 ఏళ్లుగా పరితపించిన ఓ జవాన్‌.. తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను చూడకుండానే

జమ్మూ: విధిరాత అంటే ఇదేనేమో.. పిల్లల కోసం 10 ఏళ్లుగా పరితపించిన ఓ జవాన్‌.. తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను చూడకుండానే కన్నుమూసాడు. గత ఆదివారం పాకిస్తాన్‌ చొరబాటుదారుల కాల్పుల్లో చనిపోయిన జవాన్‌ రంజీత్‌ సింగ్‌ భూత్యాల్‌ సతీమణి అతని అంత్యక్రియల ముందే పండటి బిడ్డకు జన్మనిచ్చింది.

కూతురు పుట్టిందనే ఆనందం ఆ తల్లికి భర్త మరణంతో ఆవిరైంది. బరువెక్కిన గుండెతో అప్పుడే పుట్టిన తన కూతురుని తీసుకొని అంబులెన్స్‌ సహాయంతో భర్త అంత్యక్రియలకు హాజరైంది. అధికార లాంఛనాలతో ఆ జవాన్‌ చివరి కార్యక్రమాలు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి పురిటి నొప్పులతో ప్రసూతి గదిలోకి వెళ్లిన ఆమె మంగళవారం ఉదయం 5 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 2003లో భారత సైన్యంలో చేరిన రంజీత్‌ సింగ్‌ తన భార్య ప్రసవం కోసం సెలవులు తీసుకుంటానని చెప్పాడని, కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు తీసుకున్న బతికేవాడని కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఆ వీర జవాన్‌ భార్య మాత్రం తన కూతురుని కూడా ఆమె తండ్రిలానే పెంచి సైన్యంలో చేరుస్తానని స్పష్టం చేశారు.

ఆదివారం రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు పాకిస్తాన్‌ చొరబాటుదారులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement