
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సాంకేతిక కారణాల రీత్యా మంటలు చెలరేగి ఘజ్ని ప్రావిన్స్‌లో కూలినట్లు అధికారులు నిర్ధారించారు. సోమవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కూలిన విమానం ఏ సంస్థకు చెందినదో, అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో అధికారులు స్పష్టం చేయలేదు. విమానం కూలిన దేహ్ యాక్ ప్రాంతం తాలిబన్ల అధీనంలో ఉన్నందున అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. కూలిన విమానం ఏరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఘజ్నిలో జరిగిన విమాన ప్రమాదంపై విచారించనున్నట్లు అమెరికా ఆర్మీ సోమవారం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment