ఇద్దరు ఉగ్రవాదులు హతం | Two Terrorists Killed In Encounter By Security Forces in Kashmir | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published Sat, Apr 6 2019 4:22 PM | Last Updated on Sat, Apr 6 2019 4:24 PM

Two Terrorists Killed In Encounter By Security Forces in Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని షోపియాన్‌ జిల్లాలోని ఇమామ్‌ సాహిబ్‌ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా పుల్వామా ఉగ్రదాడి, బాలకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ సైన్యం పదే పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడుతుండటంతో భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తూ కుట్రలను తిప్పికొడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement