
జమ్ము కశ్మీర్: బండిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. బుధవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఎదరుకాల్పులు జరిగాయి. ఈ ఎదరుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. బండిపొరా సెక్టార్‌లో తీవ్రవాదులు నక్కిఉన్నరానే సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.
అయితే వారి రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.