న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో గత మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018లో 257 మంది, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందిచినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 16 వరకు 113 ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు.
అంతేకాకుండా ఈ మడేళ్లలో జమ్మూ కశ్మీర్‌లోని 112 మంది పౌరులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి భద్రతా బలాలు నిరంతరం సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment