![Jawans Hands Not Tied During Ramadan: Rajnath Singh - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/29/rajnath.jpg.webp?itok=U6VfEbBm)
లక్నో: జవాన్ల చేతులు ప్రభుత్వం కట్టేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా జమ్మూ-కశ్మీర్‌లో కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ...భద్రతా దళాలపై ఆంక్షలు విధించలేదని పేర్కొన్నారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటనలో జమ్మూ-కశ్మీరులో రంజాన్ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భద్రతా దళాలు పాల్గొనబోవని తెలిపింది.
అయితే భద్రతా దళాలపై దాడి జరిగినపుడు, పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైతే కాల్పులకు పాల్పడే హక్కు భద్రతా దళాలకు ఉందని పేర్కొంది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మాట్లాడుతూ ఇది కాల్పుల విరమణ కాదన్నారు. కేవలం కార్యకలాపాలను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఉగ్రవాద కాల్పులకు పాల్పడితే భద్రతా దళాలు కాల్పులు ప్రారంభిస్తాయని చెప్పారు. తాము భద్రతా దళాల చేతులను కట్టేయలేదని, ఇటీవల ఉగ్రవాద దాడి జరిగినపుడు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment