జమ్ము కశ్మీర్ : పవిత్ర రంజాన్ మాసంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. భద్రతా దళాలను కోరిన విషయం తెలిసిందే. ముస్లిం సోదరుల ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలనే సదుద్ధేశంతో భద్రతా దళాలు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉగ్రమూకలు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. భారత్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికి సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతునే ఉన్నాయి. గురువారం నాడు కూడా బీసీ రోడ్డులో గ్రేనేడ్ దాడిలో ఇద్దరూ పోలీసు అధికారులు, ఒక సామన్య పౌరుడు గాయపడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ రోజు(శనివారం) ఉదయం ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని తందార్ సెక్టార్‌లో చొరబాటుదారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. ఇక జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబ మఫ్తి కూడా రంజాన్ పండుగ నేపథ్యంలో కాల్పులను విరమించాల్సిందిగా పాక్‌ను కోరిన సంగతి తెలిసిందే. భద్రత దళాలు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికి పాక్ మాత్రం గత తొమ్మిది రోజుల నుంచి సరిహద్దు ప్రాంతాలైన జమ్ము, సాంబ, కథువా ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో 12 మంది మరణించారని, 60 మంది గాయపడినట్లు తెలిపింది. మరణించిన వారిలో ఇద్దరు మైనర్లతో పాటు ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment