![Three Mao killed in encounter - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/26/police.jpg.webp?itok=mD-GR90U)
మల్కన్‌గిరి: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా డోగ్రీఘాట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు ఐజీ ఎస్ షైనీ తెలిపారు. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ప్రాంతంలో కిట్ బ్యాగులు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. కొరాపుట్ జిల్లాలో 24 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment