
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది సహా నలుగురు మరణించారు. పొహన్ సమీపంలో ఒక కారును ఆపేందుకు యత్నించగా.. అందులోని వ్యక్తులు ఆగకుండా వేగంగా వెళ్లడంతో భద్రతా బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయని పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాదులు కూడా కాల్పులకు పాల్పడ్డారని, ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదితో పాటు మరో ముగ్గురు మరణించారని ఆయన తెలిపారు. మృతిచెందిన ఉగ్రవాదికి ఆ ముగ్గురూ సహాయకులుగా పనిచేశారని అధికారులు చెప్పారు.