కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌, ఇద్దరు ఉగ్రవాదుల హతం | 2 militants gunned down by security forces in jammu kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌, ఇద్దరు ఉగ్రవాదుల హతం

Published Sat, Apr 22 2017 7:34 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

జమ్ముకశ్మీర్‌లో భద్రత బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భద్రత బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం సాయంత్రం బుద్గాం జిల్లా హయత్‌పురా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement