బీరట్: ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పాశవిక చర్యలకు పాల్పడుతున్న ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ గ్రూప్) మరో కీలక నగరాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. సిరియాకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆదివారం రమాదీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాగ్దాద్ కు 110 కి.మీ దూరంలో ఉన్న రమాదీ నగరంలోని అధికారిక భవనాలను ఐఎస్ ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలుత పాల్ మైరా ప్రాంతాన్ని ఆక్రమించిన ఐఎస్ దళాలు అనంతరం రమాదీ నగరంలోని పలు అధికారిక భవనాలను స్వాధీనం చేసుకున్నాయి.
గత సంవత్సరం ఐఎస్ ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం తరువాత ఇదే అతి పెద్ద దాడిగా అన్ బార్ ఆపరేషన్ కమాండర్ ముహున్వాద్ హైమోర్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి కారు బాంబులతో నగరంలోని అధిక భాగాన్ని ఐఎస్ గ్రూపు అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.