ట్యూనిష్: దాదాపు 3000 మంది ట్యూనిషియన్ యువకులు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరినట్లు ట్యూనిషియా రక్షణశాఖ సహాయమంత్రి రఫిక్ చెల్లీ తెలిపారు. ఇప్పటికే లిబియాలో అనేక మంది ఉగ్రవాద సంస్థల్లో చేరి శిక్షణ పొందుతున్నారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టర్కీ గుండా వెళ్లి ఇస్లామిక్ స్టేట్లో చేరాలని ప్రయత్నించిన 12 వేలమందిని అడ్డుకున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవాల్సిందిగా తాము ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలిచ్చినట్లు తెలియజేశారు.