మలయాళ స్టార్, మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.
మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.
వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment