మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు చాలామంది క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. ఇప్పటికే మలయాళ పరిశ్రమలోని ప్రముఖులు చాలామంది పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రముఖ హీరో మమ్ముట్టి తొలిసారి స్పందించారు.
మాలీవుడ్‌లో కొంతమంది అగ్ర నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న సమయంలో మమ్ముట్టి ఇలా స్పందించారు. హేమ కమిటీ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. సినిమా షూటింగ్ సమయంలో మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా దర్శక నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హేమ కమిటీకి నా మద్దతు ఉంటుంది.
చిత్రపరిశ్రమపై అద్యయనం చేసిన హేమ కమిటీ పలు సూచనలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అందరి మీద ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులపై పోలీసుల విచారణ నిజాయితీగానే జరుగుతుంది. జస్టిస్ హేమ కమిటీ అందించిన రిపోర్ట్ కోర్టు వద్ద ఉంది. విచారణ పూర్తి అయిన తర్వాత నిందితులకు తగిన శిక్షను కూడా కోర్టు విధిస్తుంది. ఇండస్ట్రీలో 'పవర్ సెంటర్' అనేది లేదు. కానీ, సినిమా బతకాలి.' అనేది తన అభిప్రాంయ అని మమ్ముట్టి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment