గుర్తుంచుకోండి
పార్టీల గుర్తులను ప్రకటించిన ఎన్నికల సంఘం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించిం ది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు తమ గుర్తులు వర్తిస్తాయి. అభ్యర్థులను గుర్తిస్తూ సంబంధిత నాయకులు బి ఫారం అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ల గడువు ముగిసేలోగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు వాటిని అందజేయాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతాలకు చెం దిన పార్టీలూ ఎన్నికల సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకున్నాయి. వాటిలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీ మ ప్రాంతాలకు చెందిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇతరులకు (ఇండిపెండెంట్లకు) కేటాయించేందుకు ప్రకటించిన గుర్తుల్లో కాలిక్యులేటర్ నుంచి ఎయిర్ కండిషనర్ల వరకు... క్యారెట్ నుంచి క్యారమ్ బోర్డు దాకా ఉన్నాయి. మంచం, నెయిల్ కట్టర్ వంటివి సైతం ఉన్నాయి.
ఇండిపెండెంట్ల కోసం
బీరువా, ఎయిర్ కండిషనర్, గాలిబుడగ (బెలూన్) పండ్ల బుట్ట, బ్యాట్ వంటి 81 గుర్తులను ఇండిపెండెంట్లకు ఎన్నికల సంఘం కేటాయించింది. గుర్తు రిజర్వు కాకుండా రిజిస్టరైన పార్టీలు కొన్ని పార్టీలు రిజిస్టరైనప్పటికీ వాటికి గుర్తులు రిజర్వు కాలేదు. ఆలిండియా స్రీశక్తి పార్టీ, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ వంటి 71 పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.