Shruti Haasan Posts Cryptic Message On Karma - Sakshi
Sakshi News home page

ఖర్మ ఎవరినీ విడిచిపెట్టదు: శృతిహాసన్‌

Aug 22 2023 10:32 AM | Updated on Aug 22 2023 10:49 AM

Shruti Haasan Interesting Post On Karma - Sakshi

ఆత్మవిశ్వాసం కలిగిన నటీమణుల్లో శృతిహాసన్‌ ఒకరు అని చెప్పవచ్చు. చర్యలు చాలా బోల్డ్‌గా ఉంటాయి అయితే వాటిని సమర్థించుకోవడానికి గట్స్‌ కావాలి. అలాంటి గట్స్‌ మెండుగా ఉన్న నటి శృతిహాసన్‌. ఈ బ్యూటీ లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటి సారికల వారసురాలు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఒక్క ప్లస్‌ పాయింట్‌ తోనే శృతిహాసన్‌ నటిగా నిలదొక్కుకోలేదు. అందుకు తన టాలెంట్‌ను ఉపయోగించుకొని కథానాయకిగా రాణిస్తున్నారు.

హిందీ, తమిళం భాషల కంటే తెలుగులోనే మంచి విజయాలను, పేరును తెచ్చుకున్న నటి శృతిహాసన్‌. నిజానికి తమిళంలో నటించాలనే ఆశ ఈమెకు చాలానే ఉంది. ఎందుకనో ఇక్కడ దర్శక నిర్మాతలు శృతిహాసన్‌ను పట్టించుకోవడం లేదు. సరైన సక్సెస్‌లు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈమె తమిళంలో నటించిన చివరి చిత్రం లాభం. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన పాన్‌ ఇడియా చిత్రం సలార్‌లో నటిస్తున్నారు. దీంతోపాటు హాయ్‌ నాన్న అనే చిత్రంలోని శృతిహాసన్‌ నటిస్తున్నారు. అదేవిధంగా ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రం కూడా చేస్తున్నారు.

కాగా హేతువాది కమలహాసన్‌ కూతురు అయిన శృతిహాసన్‌కు మాత్రం కర్మ సిద్ధాంతాలపై నమ్మకం ఎక్కువ. ఈమె ఇన్‌ స్ట్రాగామ్‌లో తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. కాగా శృతిహాసన్‌ ప్రేమ వ్యవహారం గురించి రకరకాల వదంతులు దొర్లుతుంటాయి. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఈమె ఇటీవల ఖర్మ సిద్ధాంతం గురించి మాట్లాడారు. ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో ‘కొందరు తమ గోతులను తవ్వి దాటడానికి తయారవుతున్నారు. దాన్ని తాను ప్రశాంతంగా గమనిస్తున్నాను. మనం మన పనిని చేసుకుంటూ పోవాలి ఏదేమైనా ఖర్మ కచ్చితంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ఆటను మాత్రం చూడండి’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement