- పరారీలో నిందితుడు
- ఆందోళనలో బాధితులు
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుకు సిద్ధం
రూ.50 లక్షలకు టోకరా ?
Published Sat, Oct 1 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
హసన్పర్తి: హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.50 లక్షలతో ఉడాయించాడని సమాచారం. వ్యాపార నిమిత్తం వివిధ వర్గాల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించలేనని భావించి ఊరు వదిలి వెళ్లిపోయాడు. వివరాలిలా ఉన్నాయి... హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి నగరంలోని 46వ డివిజన్ గోపాలపురం విజయానగర్ కాలనీలో ఓ షాప్ నిర్వహణకు వివిధ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. దీంతో పాటు రోజూవారీ చీటీల రూపంలో కూడా అప్పు చేశాడు. అయితే వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టం రావడంతో అప్పు చెల్లించలేననే భయంతో పరారయ్యాడు. అయితే పరారీ కావడానికి నాలుగు రోజుల ముందు కూడా రూ. 2 లక్షలు అప్పు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
రూ.10 వడ్డీ చొప్పున...
వ్యాపారి తనకు అవసర నిమిత్తం రూ.10 చొప్పున వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నా రు. ప్రతి రోజు రూ.3వేల చొప్పున వడ్డీ కట్టే వాడని సమాచారం. షాప్ ద్వారా వచ్చే లాభంతో పాటు అదనంగా డబ్బులు వడ్డీ రూపంలో అప్పుల వారికి చెల్లించేవాడని తె లిసింది. దీంతో ఇటు అప్పులు పెరగడం, అటూ షాప్‌లో నష్టాలు రావడంతో ఉడాయించాడు. చిట్టీలు నడిపించే వారు రెండు రోజులుగా అతని కోసం ప్రయత్నించినా అ డ్రస్ లభించలేదు. అతడి ఇంటికి వెళ్లినప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు పేర్కొన్నారు. దీంతో అప్పులు ఇచ్చిన వారు పోలీ స్‌స్టేన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement