డబ్బుల కోసమే దంపతుల హత్య | Murder Case Solved In Hasanparthi | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసమే దంపతుల హత్య

Published Thu, Jun 21 2018 2:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM

Murder Case Solved In Hasanparthi - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ రవీందర్‌ వివరాలు వెల్లడిస్తున్న సీపీ రవీందర్‌ 

వరంగల్‌ క్రైం: హసన్‌పర్తి మండల కేంద్రంలో గడ్డం దామోదర్, పద్మ దంపతులను హత్య చేసిన నిందితుడిని పోలీసులు 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారు. దంపతుల దారుణ హత్య వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో సంచలనం కలిగించింది. హత్యను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పక్కా.. ఆధారాలతో అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ మాట్లాడారు.

హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కామారపు ప్రశాంత్‌ (32) కిరాణం షాపు నిర్వహించి నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని ఎలాగైన పూడ్చాలనే ఉద్దేశ్యంతో పక్కనే కిరాణం షాపు నిర్వహించుకుంటున్న మృతులు గడ్డం దామోదర్‌(60), గడ్డం పద్మ(54)లను గత కొన్ని రోజులుగా మచ్చిగా చేసుకోని తరచుగా వస్తూపోతూ ఉండేవారని తెలిపారు. నిం దితుడికి డబ్బులు అవసరం రావడంతో సోమవారం రాత్రి రహస్యంగా ఇంటిలోకి చొరబడి మృ తురాలైన పద్మను బాత్‌రూం వద్ద కత్తితో బెది రించడంతో పద్మ ప్రతిఘటించింది.

దీంతో ప్ర శాంత్‌ సిమెంట్‌ ఇటుకతో ముఖంపై బలంగా కొట్టి కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు సీపీ తెలిపారు. దీంతో పాటు ఇంట్లో మంచంపై పడుకొని ఉన్న దామోదర్‌(వికలాంగుడు)పై కూడా సిమెంట్‌ ఇటుకతో విచక్షణ రహితంగా కొట్టి కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు సీపీ రవీందర్‌ వివరించారు. గడ్డం పున్నం చందర్‌ ఫిర్యాదు మేరకు కామారపు ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్లు 449, 380, 302 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

దంపతులను హత్య చేసి దోచుకున్న బంగారం, వెండి ఆభరణాలను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 4,75,863 విలువ గల 132.280 గ్రాముల బంగారం, 356.240 గ్రాముల వెండి, రూ.6,500 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫలితం ఇచ్చిన టీం వర్క్‌..

హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ ఎవరిని నిందించకుండా అధికారులందరిని సమావేశ పరిచి ఇది మనందరికి ఛాలెంజ్‌ 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చూపితేనే జనంలో మనపై నమ్మకం ఉంటుంది. అంటూ ప్రోత్సాహం నిం పారు. దీంతో సవాల్‌గా తీసుకున్న పోలీసులు అ న్ని కోణాల్లో చేసిన టీం వర్క్‌కు ఫలితం దక్కింది. స్వయంగా పోలీసు కమిషనర్‌ ప్రెస్‌ మీట్‌లో  ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరిని అభినందించారు.

నివ్వెర పరిచిన నిందితుడు

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగిన దంపతుల దారుణ హత్య కేసు చేదనలో  పోలీసులు చూపిన ప్రతిభ ప్రశంసలు అందాయి. హత్య వెలుగు చూసిన గంటలోపే నిందితుడిని పసిగట్టడంతో పోలీసులు సక్సెస్‌ అయ్యారు. కానీ నిందితుడి భౌతిక ఆకారం, హావ భావలను చూసి నిందితుడు ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడు అనే విషయం పూర్తి స్థాయిలో విచరణ చేసే వరకు నిర్థిరించుకోలేక పోయారు.

నిందితుడు పోలీసుల విచారణలో అర్థరాత్రి తర్వాత నోరు విప్పడంతో విచారణలో పాల్గొన్న అధికారులంతా ఒక్కసారిగా నిర్ఘంతపోయారు. సీనియర్‌ పోలీసు అధికారులకు సహితం అంతుచిక్కకుండా నిందితుడి ప్రవర్తన ఉండటం గమనార్హం. గడ్డం దామోదర్, గడ్డం పద్య హత్య సంఘటనలో స్థానిక ప్రజలతో పాటు నిందితుడు అక్కడె తిరగడం, ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రవర్తించడం, ఎలాంటి భయం లేకుండా చాలా సమయం సంఘటన స్థలంలో ఉండటం పోలీసులకు సహితం అంతు చిక్కలేదు.

 స్థానిక పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించిన తర్వాత, స్థానికులను విచారించిన తర్వాత హత్య నిందితుడు కామారపు ప్రశాంత్‌ అని ప్రాథమికంగా అనుమానంతోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అ నంతరం నిందితుడి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా, పో లీసు డాగ్‌ చూపెట్టిన క్లూ ఆధారంగా విచారణ ప్రా రంభించారు. హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్లో ఒకడైన నిందితుడు ప్రశాంత్‌ నోరు తెరిచే వరకు కూడా పోలీసులు నిర్థారించలేకపోయారు.

కాజీపేట ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్‌పెక్టర్‌ పుల్యాల కిషన్‌లు ఇద్దరి దగ్గర ఉన్న సమాచారం నిందితుడు ప్రశాంత్‌ చుట్టే ఆధారాలు తిరగడంతో నిందితుడి ఈ ఇద్దరు అధికారులు ఎంతో ఓపికతో ప్రశ్నించి కూపీ లాగారు. దీంతో నిందితుడు హత్య చేసిన విధానాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

నిందితుడిని ఉరి తీయాలి..

హసన్‌పర్తి: మండల కేంద్రానికి చెందిన గడ్డం దామోదర్, పద్మ  హత్యకు కారకుడైన కామారపు ప్రశాంత్‌ను ఉరి తీయాలని బంధువులు, మిత్రులు, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మృతదేహాలతో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.

అధికారులకు అభినందనలు...

దంపతుల హత్యను 24 గంటల్లో చేధించడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ అభినందించారు. దర్యాప్తు బృందం కాజీపేట ఏసీపీ సత్యనారాయణ, హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ పుల్యాల కిష న్, ఎస్సైలు టీవీఆర్‌ సూరి, సాంబమూర్తి, వీరభద్రారావు, విజయ్, రాçహుల్, సుధాకర్, నాగబా బు, కానిస్టేబుల్‌ మధుకర్, టాస్క్‌ఫోర్స్, తదిత ర విభాగాల అధికారులను అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement