![Couple Brutally Murdered in Hasanparthy - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/06/19/wgl.jpg.webp?itok=lL33HFHr)
సాక్షి, వరంగల్ (అర్బన్) : జిల్లాలోని హసన్‌పర్తిలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు మంగళవారం దంపతుల గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన భార్యాభర్తలను దామోదర్, పద్మగా గుర్తించారు. దోడిపీ దొంగలే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీయత్నాన్ని దంపతులు అడ్డుకోవడంతో వారిని దారుణంగా హతమార్చారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై దర్యాప్తు, నిందితుల గాలింపు కోసం పోలీసులు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment