కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అవిర్భావం సందర్భంగా జూన్ 2 నుంచి వారం రోజులపాటు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున అవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అహ్మద్‌బాబు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిర్భావ సం బరాలకు సంబంధించి అధికారులతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, జిల్లా పరిషత్, మున్సిపల్ కా ర్యాలయాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లోని మం డల కార్యాలయాల్లో విద్యుద్దీపాలతో అలంకరించాల ని ఆదేశించారు.
జూన్ 2న జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ఉదయం 8:45 గంటలకు జాతీయ ప తాకం ఆవిష్కరించి తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ శా ఖలవారీగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆస్తుల పంపకాలు నిర్వహించబడుతాయని తెలిపారు. జూన్ 2 నుంచి వారం రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంట ల వరకు పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
తెలంగాణ చారిత్రక ప్రదర్శన న మూనాలతో, ఛాయచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాల ని డీపీఆర్వోను ఆదేశించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాలలోని ప్రధాన రహదారులలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాంధీపార్కులలో విద్యుద్దీపాలతో అలకరించడంతోపాటు డెకొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, అదనపు జేసీ రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు, సీపీవో షేక్‌మీరా, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీటీసీ ప్రవీణ్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
వారం రోజులు ఆవిర్భావ వేడుకలు
Published Sat, May 31 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement