
మెదక్: ప్రేమ విఫలమై ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన అల్లాదుర్గం వడ్డేర కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డేర రాజు(22), పాపన్నపేటకు చెందిన యువతి ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల సంగారెడ్డిలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఎందుకో రాజుతో ప్రేమ వద్దనుకుని ఆమె వెళ్లిపోయింది. ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురై అతడు ఆదివారం రాత్రి అల్లాదుర్గంలో ఉన్న ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment