సంగారెడ్డి: మతిస్థిమితం కోల్పోయిన యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన ఉడుత శ్రీనివాస్ (24) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు.
ఈ క్రమంలో రాఖీ పండగ సందర్భంగా సొంతూరికి వచ్చాడు. కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేని శ్రీనివాస్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించగా పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment