కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత మునిపల్లె రాజు(ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత మునిపల్లె రాజు (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు శనివారం హైదరాబాద్ సైనిక్‌పురిలోని స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రాజు 1925లో జన్మించారు. తెనాలిలో బాల్యం గడిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజుకు కళలు, సాహిత్య విభాగంలో 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన సాహితీ రంగంలో చేసిన కృషికి జ్యేష్ఠ లిటరసీ అవార్డు, శాస్త్రి మెమోరియల్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయ అవార్డు(రెండుసార్లు) గోపీచంద్ అవార్డు, ఆంధ్ర సారస్వత సమితి తదితర అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment